News February 16, 2026
భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీవాణి

భువనగిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్‌పర్సన్‌గా పోతంశెట్టి మంజుల ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. నూతన ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్‌లకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 20, 2026
నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నల్గొండ: ఫోన్ పేలో లంచాలు.. ఇద్దరిపై వేటు

డిజిటల్ చెల్లింపుల ముసుగులో అవినీతికి తెరలేపిన 8 మంది విద్యుత్ అధికారులను TGSPDCL సస్పెండ్ చేసింది. యాదాద్రి సర్కిల్‌లోని భువనగిరి ఆపరేషన్స్ ADE ఆనంద్‌రెడ్డి రూ.5వేలు, చౌటుప్పల్ లైన్‌మెన్ శ్రీనివాస్ రూ.45వేలు లంచం తీసుకున్నారని నిరూపితమైంది. వివిధ పనుల నిమిత్తం వినియోగదారుల నుంచి ఫోన్ పే ద్వారా లంచాలు వసూలు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అవినీతి బాగోతం బట్టబయలైంది.