News January 28, 2025

భువనగిరి: రైతుల ఖాతాల్లో రూ.26.95 కోట్లు జమ

image

భువనగిరి జిల్లాకు 26.95 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 17 మండలాల్లో ఎంపిక చేసిన 17 గ్రామాల రైతు ఖాతాల్లో డబ్బులు పడ్డాయని అధికారులు తెలిపారు. మిగతా రైతుల ఖాతాల్లో విడదల వారీగా జమ చేస్తామన్నారు. 

Similar News

News July 9, 2025

లక్ష్మీ బ్యారేజీలో భారీగా వరద ప్రవాహం

image

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో బుధవారం సాయంత్రం గోదావరికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి పెద్ద ఎత్తున వరద కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీలో సాయంత్రం 6 గంటలకు 2,41,530 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి గోదావరికి వరద ప్రవాహం బాగా పెరుగుతోంది.

News July 9, 2025

KNR: SRR (అటనామస్) కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల

image

కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ (అటనామస్) కళాశాల డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, SU కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి.సురేశ్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీనివాస్, అధ్యాపకుల బృందంతో కలిసి బుధవారం విడుదల చేశారు. 6వ సెమిస్టర్‌తోపాటు డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులైన వారు 79%, 4వ సెమిస్టర్‌లో 38%, 2వ సెమిస్టర్‌లో 30% ఉత్తీర్ణత సాధించారు.

News July 9, 2025

పాడేరు: ‘టీచర్లే లేని పాఠశాలలకు మెగా పీటీఎం అవసరమా?’

image

అల్లూరి జిల్లా వ్యాప్తంగా గల 11 మండలాల పరిధిలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమై నేటి వరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఎలా నిర్వహిస్తారని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మాధవ్, బాబూజీ, కిషోర్ ప్రశ్నించారు. బుధవారం పాడేరులో వారు మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు.