News July 10, 2025
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మోత్కూర్ జామచెట్లబావి ఎక్స్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుండాల మండలం వంగాలకి చెందిన చిప్పలపల్లి శంకర్ (48) టీవీఎస్‌పై మోత్కూర్ నుంచి ఇంటికి వెళుతున్నాడు. ఓ మైనర్ బాలుడు బైక్‌పై అతి వేగంగా వచ్చి శంకర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News July 10, 2025
సత్యసాయి భక్తులు గ్రేట్…!

విశాఖలో జరిగిన గిరిప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసిన భక్తులకు ఉపశమనం కల్పించేందుకు విశాఖ జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థ సేవలు అందించింది. ప్రదక్షిణ జరిగిన పలు ప్రాంతాల్లో ప్రత్యేక వనమూలికలతో తయారు చేసిన నూనెతో భక్తుల కాళ్లకు మర్దన చేశారు. టీ, మిర్యాల పాలు, ప్రసాదం, అల్పాహారం అందించారు. ఎమ్మెల్యే గణబాబు వీరి సేవలను వీక్షించి అభినందించారు.
News July 10, 2025
జగిత్యాల: ‘భవిష్యత్తులో లోవోల్టేజ్ సమస్య ఉండదు’

వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని జగిత్యాల SE బి.సుదర్శనం తెలిపారు. ఇందులో భాగంగా జగిత్యాల సర్కిల్ పరిధిలో కొత్తగా 9 సబ్ స్టేషన్‌లు మంజూరయ్యాయని, పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్‌లు నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఎటువంటి లోవోల్టేజ్ సమస్య ఉండదని తెలియజేశారు.
News July 10, 2025
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యూట్యూబర్లు శ్రీముఖి, శ్యామల, హర్షసాయి, సన్నీయాదవ్, లోకల్ బాయ్ నాని సహా 29 మందిపై ED కేసు నమోదు చేసింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేశారని మియాపూర్ పోలీస్ స్టేషన్లో గతంలో FIR నమోదైన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలకు దిగింది.