News February 6, 2025

భువనగిరి లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

image

భువనగిరిలోని పలు లాడ్జీలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేరా, డాల్ఫిన్, ఎస్వీ, ఎస్ఆర్ లాడ్జీలను చెక్ చేశామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా అని లాడ్జి యాజమాన్యాన్ని ఆరా తీసినట్లు చెప్పారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లైతే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.

Similar News

News February 7, 2025

పెద్దపల్లి జిల్లాలోని నేటి టాప్ న్యూస్

image

@ ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ@ గోదావరిఖనిలో బులియన్ వ్యాపారి పరారీ@ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష@ సుల్తానాబాద్ లో డయాబెటిస్ పరీక్షలకు విశేష స్పందన@ పెద్దపల్లి దుకాణాలలో మున్సిపల్ సిబ్బంది ఆకస్మిక తనిఖీ@ భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ: రామగుండం సిపి శ్రీనివాస్@ పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం పై దాసరి ఉష విమర్శలు

News February 6, 2025

పడుకునే ముందు ఈ పనులు చేస్తే..

image

రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్‌ను వేరే గదిలో ఉంచడం బెటర్.

News February 6, 2025

ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్

image

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు SRCL కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద బుధవారం రాత్రి రూ.లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా గురువారం మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

error: Content is protected !!