News January 30, 2025

భువనగిరి: వాగులో జారిపడి దంపతులకు గాయాలు 

image

వాగు దాటుతుండగా జారి పడిపోవడంతో దంపతులకు గాయాలైన ఘటన ఆలేరులో జరిగింది. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన సందెన రామనర్సయ్య, అతడి భార్య లక్ష్మి బైక్‌పై పోచన్న పేటలో తమ బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో కొలనుపాక వాగు దాటుతుండగా జారి వాగులో పడిపోయారు. తీవ్రగాయాలు కాగా 108 వాహనంలో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 10, 2025

కురుమూర్తి జాతర పొడిగింపు

image

వర్షాభావం కారణంగా భక్తుల రాక తగ్గడంతో అమ్మపురం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో అలంకార దర్శనాలను నవంబర్ 17 వరకు పొడిగించారు. ఈ మేరకు పాలకమండలి ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి, ఈవో మదనేశ్వర్ రెడ్డి ప్రకటించారు. నవంబర్ 17న ఉదయం 10 గంటలకు అలంకారం తొలగించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.

News November 10, 2025

TODAY HEADLINES

image

➧ కేసీఆర్ తెచ్చిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదు: CM రేవంత్
➧ అనారోగ్యమే అసలైన పేదరికం: సీఎం చంద్రబాబు
➧ ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. ఎల్లుండి పోలింగ్
➧ వారంలో TG TET నోటిఫికేషన్?
➧ ప్రభుత్వాన్ని మార్చడం వల్ల ఇబ్బందులొస్తాయి.. బిహార్ ప్రచారంలో లోకేశ్
➧ ఉత్తుత్తి పర్యటనలతో పవన్ హడావుడి: YCP
➧ డిసెంబర్ 15న IPL వేలం!

News November 10, 2025

సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

image

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండ‌రీ ఆసుప‌త్రులుండ‌గా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుప‌త్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్ద‌రు చొప్పున, మ‌రో 13 ఏరియా ఆసుప‌త్రుల‌కు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుప‌త్రుల‌కు ఇద్ద‌రు చొప్పున స్పెష‌లిస్టుల‌ను నియ‌మించారు. మ‌రో 97 ఆసుప‌త్రుల‌కు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.