News February 23, 2025

భువనగిరి: వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే సూసైడ్

image

వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మోటకొండూర్ మండలం అమ్మనబోలులో జరిగింది. ఎస్సై వివరాలిలా.. జటంగి మహేశ్ యాదవ్ (28) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబీకులు మార్చి 2న మహేశ్ వివాహం నిశ్చయించారు. శుక్రవారం మహేశ్ తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News November 8, 2025

కొత్తగా CDF పోస్టు… పాక్ ఆర్మీలో కీలక మార్పు!

image

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ రక్షణ వ్యవహారాల్లో పలు మార్పులు వస్తున్నాయి. భారత CDS మాదిరిగా కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF) పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల బాధ్యత అప్పగిస్తారని ‘GEONEWS’ పేర్కొంది. సైన్యంపై అధికారం అధ్యక్షుడు, ప్రభుత్వానికి కాకుండా CDFకు ఉంటుందని తెలిపింది. త్వరలో రిటైర్ కానున్న ఆర్మీ చీఫ్ మునీర్‌ రేసులో ఉన్నారని వెల్లడించింది.

News November 8, 2025

VJA: ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదించిన ప్రజాప్రతినిధులు

image

విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్‌కు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ RRR, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఆది నుంచి అంతం వరకు వారు ఇళయరాజా స్వర రాగాలను ఆస్వాదించారు.

News November 8, 2025

యువతకు భద్రత కల్పించండి: SP

image

యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని SP ధీరజ్ కునుబిల్లి శనివారం జిల్లా పోలీసులను ఆదేశించారు. ‘శక్తి’ టీమ్ బృందాలు జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాల నివారణపై విద్యార్థులకు పోలీసులు వివరించారు. తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్) షేర్ చేయడం వలన ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.