News March 23, 2025
భువనగిరి: వీధి కుక్కల బీభత్సం.. వృద్ధుడికి తీవ్ర గాయాలు

భువనగిరి మండలం తాజ్పూర్‌లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ముగ్గురిలో వృద్ధుడైన మౌలానా తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కల బెడడను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో నిత్యం ఎక్కడో చోట ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.
Similar News
News November 5, 2025
పశువుల్లో రేబీస్ వ్యాధిని ఎలా గుర్తించాలి?

రేబీస్ వ్యాధి సోకిన పశువుల్లో జ్వరం వస్తుంది. తర్వాత కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల పశువులు అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కండరాలలోని నరాలు దెబ్బతినడం వల్ల పక్షవాతం సోకుతుంది. మేతను మింగలేకపోవడం, నీటిని చూసి భయపడటం, అధిక లాలాజలం స్రవించడం, బలహీనత, ఎక్కువగా అరవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులను కుక్క కరిస్తే సాధ్యమైనంత త్వరగా వెటర్నరీ డాక్టరు సూచనలతో యాంటీరేబీస్ టీకా వేయించాలి.
News November 5, 2025
కార్తీక మాసం: ఉసిరి దీపం ఎందుకు పెడతారు?

ఉసిరి చెట్టు అంటే శివస్వరూపం. అందుకే కార్తీకంలో దానికి పూజలు చేస్తారు. దీని కింద దీపం పెడితే సకల కష్టాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శివ పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం పెడితే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి.. ఈ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవీ ఆర్థిక బాధలన్నీ తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం శుభప్రదం.
News November 5, 2025
తెనాలి: వ్యభిచార గృహం నిర్వహిస్తున్న భార్యాభర్తల అరెస్ట్

తెనాలి మండలం కఠెవరం పంచాయతీ పరిధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న షేక్ గపూర్ అతని రెండవ భార్య దుర్గా భవానీని అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఆనంద్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు డబ్బులు ఆశ చూపి ఆమెతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా..14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మహిళను స్వధార్ కేంద్రానికి పంపించినట్లు ఎస్ఐ వెల్లడించారు.


