News February 3, 2025

భువనగిరి: సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు 

image

యాదాద్రి జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 42 సెంటర్లు ఏర్పాటు చేయగా 6,418 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లు జరగనున్నాయి. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా, అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.  

Similar News

News September 15, 2025

విశాఖలో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు

image

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్‌లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్‌పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.

News September 15, 2025

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు

image

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా సౌర్యమాన్ పటేల్‌‌తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఐపీఎస్ రాహుల్ శర్మకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News September 15, 2025

బాపట్ల కలెక్టరేట్‌కు 164 అర్జీలు: కలెక్టర్

image

బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 164 అర్జీలు వచ్చినట్లు ఇన్‌ఛార్జి జేసి, డీఆర్ఓ గంగాధర్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా వినతి పత్రాలు సేకరించారు. బాధితులకు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా ఉన్నారు.