News March 18, 2025

భువనగిరి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా కూలీ బిడ్డ  

image

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు రామన్నపేట(M) వెల్లంకికి చెందిన బలికె తరుణ్ కుమార్. రాష్ట్రంలో TGPSC సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. TGలో 32, 5వ జోనల్‌లో 5 ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ లైబ్రరీలో చదువుకుంటూ ఈ ఘనత అందుకున్నాడు. తండ్రి నర్సింహా ముంబైలో వలస కార్మికుడిగా, తల్లి మహేశ్వరీ గ్రామంలో కూలీ పని చేస్తున్నారు. అతనికి స్నేహితులు సహకారం అందించారు.

Similar News

News March 18, 2025

IPL-2025: తక్కువ జీతమున్న కెప్టెన్ ఇతడే!

image

మరికొన్ని రోజుల్లో IPL-2025 మొదలుకానుండగా కెప్టెన్ల జీతాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా LSG కెప్టెన్ పంత్ రూ.27 కోట్లు జీతం పొందనున్నారు. అలాగే అత్యల్పంగా KKR కెప్టెన్ రహానె రూ.1.5 కోట్లు తీసుకోనున్నారు. పంత్ తర్వాత అయ్యర్(PBKS) రూ.26.75Cr, గైక్వాడ్ (CSK) ₹18 Cr, సంజూ(RR) ₹18Cr, కమిన్స్(SRH) ₹18Cr, అక్షర్(DC) ₹16.50 Cr, గిల్(GT) ₹16.50Cr, పాండ్య(MI) ₹16.35Cr, రజత్(RCB) ₹11Cr.

News March 18, 2025

రేపు కృష్ణా జిల్లాకు రానున్న మంత్రి నారా లోకేశ్

image

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆగిపోయిన అశోక్ లేలాండ్ ప్లాంట్‌కు కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పలువురు అధికారులుు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నిరీక్షణలో ఉన్న స్థానికులకు ఇది వరంలాంటిదన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక హబ్‌గా ముందడుగు వేయనున్నట్లు తెలిపారు.

News March 18, 2025

అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

image

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్‌కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

error: Content is protected !!