News August 2, 2024

భూకబ్జాలపై 4న మదనపల్లెలో సదస్సు: సీపీఐ

image

వైసీపీ నాయకుల భూకబ్జాలపై 4న మదనపల్లెలో సదస్సు నిర్వహించనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ తెలిపారు. విశాఖలో గురువారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో ఆయన తాజారాజకీయ పరిస్థితులను వివరించారు. మదనపల్లిలో ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే రెవెన్యూ రికార్డులను తగలబెట్టారని, దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని సాకులు చెప్తున్నారని అన్నారు.

Similar News

News September 23, 2025

విశాఖలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు

image

నగరంలోని నోవాటెల్ హోటల్‌లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు రెండో రోజు కొనసాగింది. సదస్సులో భాగంగా ‘సివిల్ సర్వీసెస్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ అంశంపై మూడో ప్లీనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెక్రటరీ రష్మీ చౌదరి ప్రధాన వక్తగా వ్యవహరించారు. చర్చలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు పునీత్ యాదవ్, మోహన్ ఖంధార్, అహ్మద్ బాబు, ఎస్.సాంబశివరావు, పీయూష్ సింగ్లా పాల్గొన్నారు.

News September 23, 2025

బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్‌గా విశాఖ: కాటమనేని

image

విశాఖను ప్రపంచ స్థాయి ఐటీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, అదానీ, ఇన్ఫోసిస్, మౌరి టెక్ వంటి కంపెనీలు పనిచేస్తున్నాయని రాష్ట్ర ITE&C కార్యదర్శి కటామనేని భాస్కర్ తెలిపారు. విశాఖను ‘బ్లూ ఎడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఇన్నోవేషన్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని కటంనేని స్పష్టం చేశారు.

News September 23, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం

image

విశాఖ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ ఫంక్వాల్ సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్లాట్ ఫాంపై ఉన్న ఫుడ్ కోర్టులను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. రిజర్వేషన్ కేంద్రాలను, టికెట్ బుకింగ్ కౌంటర్ లను,క్యాప్సిల్ హోటల్‌ను సందర్శించి పలు సూచనలు చేశారు. రానున్న దసరా సెలవు దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యాలు అందించాలని సూచించారు.