News March 3, 2025

భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

వెలుగోడు మండలం నుంచి ఎస్ఐలుగా యువతీ, యువకుడు

image

వెలుగోడు మండలం మాధవరానికి చెందిన మద్దెల సంజీవ కుమార్ కొడుకు సతీశ్, గుంతకందాలకు చెందిన వెంకటేశ్వర్లు కుమార్తె నాగ కీర్తన ఎస్ఐలుగా ఎంపికయ్యారు. అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న సతీశ్‌కు శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. నాగ కీర్తనకు కడపలో పోస్టింగ్ ఇచ్చారు. వీరిరువురినీ వారి కుటుంబ సభ్యులు అభినందించారు.

News March 4, 2025

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

యాసంగి పంటలను సంరక్షించేలా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి యాసంగి పంటలకు సాగునీటి సరఫరా, గురుకులాల్లో రెగ్యులర్‌గా తనిఖీలు, ప్లాస్టిక్ ఫ్రీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.

News March 4, 2025

విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు: వరుణ్ రెడ్డి

image

హన్మకొండలోని NPDCL కార్యాలయంలో 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి , ఏప్రిల్ నెలలు పరీక్షల సమయం కావున విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవర్ లోడ్ పెరిగే అవకాశం ఉన్న చోట ట్రాన్స్‌ఫార్మర్లు సామర్థ్యం పెంపుదల చేయాలని తెలిపారు.

error: Content is protected !!