News September 8, 2025
భూపాలపల్లి: ‘అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి’

ఆది కర్మయోగి అభియాన్ మిషన్‌ను గ్రామ స్థాయిలో మూవ్‌మెంట్ లాగా అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లి ఐడీఓసీలో ఆది కర్మయోగి అభియాన్ మిషన్‌పై అధికారులతో డిస్ట్రిక్ ప్రాసెస్ ల్యాబ్ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 37 గిరిజన గ్రామాలను ఆదికర్మ యోగి అభియాన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు తెలిపారు.
Similar News
News September 10, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన NDA అభ్యర్థికి 452 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏకు 427+11(వైసీపీ) ఎంపీల సపోర్ట్ ఉంది. దీని ప్రకారం NDAకు 438 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి క్రాస్ ఓటింగ్ ఓట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఇండీ కూటమి ఎంపీలు 315మంది ఓట్లేశారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కానీ ఫలితాల్లో వారి అభ్యర్థికి 300 ఓట్లే పడ్డాయి. మరోవైపు 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
News September 10, 2025
ఇకపై ఓయూ విద్యార్థులకు ఏఐ, ఎంఎల్ నైపుణ్యాలు

ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు AI, మిషన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్ రంగాలలో నైపుణ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఏఐ లింక్ టెక్నాలజీస్ సంస్థతో ఓయూ ఇంజినీరింగ్ కళాశాల అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులను అత్యాధునిక నైపుణ్యాలతో నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇరువర్గాలు ఒప్పందంపై సంతకాలు చేశారు. JNTUHలో ఇప్పటికే ఈ పద్ధతిలో బోధిస్తున్నారు.