News November 27, 2025

భూపాలపల్లి: ‘ఆధార్ సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా పని చేయాలి’

image

ఆధార్ సేవలు ప్రజలకు సక్రమంగా అందేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం భూపాలపల్లిలో విద్య, వైద్య, సంక్షేమ తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్లు గడువులోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,64,369 మందికి ఆధార్ కార్డులున్నాయన్నారు.

Similar News

News November 27, 2025

NGKL: మొదటి రోజు నామినేషన్లు మండలాల వారీగా ఇలా..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు మొత్తం 121 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి.
వంగూరు: 24
తెలకపల్లి: 25
తాడూరు: 23
కల్వకుర్తి: 19
వెల్దండ: 19
ఊర్కొండ: 11
అలాగే, వార్డులకు 26 మంది నామినేషన్లు వేశారు.

News November 27, 2025

సిరిసిల్ల: జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ జనరల్, వ్యయ అబ్జర్వర్లు పీ.రవి కుమార్, కే.రాజ్ కుమార్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ అధికారులు జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు.

News November 27, 2025

సిరిసిల్ల: ‘జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలి’

image

ఆరోగ్య పథకాలు 100% సాధించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో ఆరోగ్య పథకాలపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య పథకాలు సాధించి జిల్లాను ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామకృష్ణ, అనిత, నహిమ, సిబ్బంది పాల్గొన్నారు.