News March 9, 2026

భూపాలపల్లి: ఆనాటి జగన్మోహిని కేశవ విగ్రహం.. నేడే ప్రతిష్ఠాపన

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని జగ్గయ్యపల్లె గ్రామ పరిసర ప్రాంతంలోని వాగులో 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి శిలా విగ్రహం ఇటీవల లభించిన విషయం తెలిసిందే. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో జగ్గయ్యపల్లెకి తరలించారు. కాగా, విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం నేడు జగ్గయ్యపల్లెలో ఉ.8 నుంచి మ.12 వరకు నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.

Similar News

News March 9, 2026

MBNR: ఈనెల 11 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రాక్టికల్స్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సైన్స్, కంప్యూటర్స్ విద్యార్థులకు 1వ సెమిస్టర్ ప్రయోగ తరగతులు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 80% హాజరు ఉన్న విద్యార్థులనే అనుమతిస్తారని రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మరిన్ని వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.

News March 9, 2026

అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

image

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.

News March 9, 2026

జూరాల ప్రాజెక్ట్ వద్ద ‘సేఫ్టీ’ వంతెన ఎందుకంటే: డీకే అరుణ

image

జూరాల ప్రాజెక్టు భద్రతకు రక్షణవంతెన అనివార్యమని మొదటి నుంచి MP డీకే అరుణ చెబుతున్నారు. 20KM దూరంలో కొత్తపల్లి వద్ద R&B వంతెన నిర్మిస్తున్నా అది కేవలం రవాణాకే పరిమితం అవుతుందని, దానికి వ్యతిరేకం కాదన్నారు. వరద సమయాల్లో గేట్లుమొరాయిస్తే భారీక్రేన్లు, యంత్రాలను తక్షణమే ప్రాజెక్టు అవతలి వైపునకు చేర్చడానికి వంతెన అవసరంని ఇంజినీర్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.