News September 7, 2025
భూపాలపల్లి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై పురుగు మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్ఐ అశోక్ కథనం మేరకు.. మొగుళ్లపల్లి మండలం పెద్దకొమిటీ గ్రామానికి చెందిన బండి గోపి(42) ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై ఈనెల 5న మద్యం మత్తులో తన కౌలు చేను వద్ద పురుగు మందు తాగాడు. ఈ మేరకు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 8, 2025
జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ జరుగుతుంది: కలెక్టర్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం PGRS కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో తమ సిబ్బంది అర్జీలను స్వీకరిస్తారన్నారు. https://meekosam.ap.gov.in వెబ్‌సైట్లో ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 1100కి ఫోన్ చేసి కూడా తమ అర్జీ సమాచారం తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.
News September 8, 2025
రాజమండ్రిలో నేడు యథాతథంగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

రాజమండ్రిలో నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథాతదంగా జరగనుందని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు నేరుగా సమర్పించుకోవచ్చుని అన్నారు. అర్జీలు ముందుగా Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు.
News September 8, 2025
కడియం: అమోనియా, నానో యూరియాలను రైతులు వాడుకోవాలి

కడియం, రాజమండ్రి రూరల్ మండలంలో తూ.గో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నేతల మల్లికార్జున రావు ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలను ఆదివారం పరిశీలించారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియా తగు పరిమాణంలోని మాత్రమే వాడాలని అధికంగా వాడితే పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుందని వారికి చెప్పారు. అమోనియా, నానో యూరియాలను రైతులు తమ పొలంలో వాడుకొని పెట్టుబడి తగ్గించుకోవాలన్నారు.