News March 4, 2025

భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం

image

నిన్న రాత్రి రాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.

Similar News

News March 4, 2025

భూపాలపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షా హాళ్ల పరిస్థితులు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ, మార్గదర్శకాల అమలును పరిశీలించారు. జిల్లాలో 3,615 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News March 4, 2025

కోహ్లీ హాఫ్ సెంచరీ, అయ్యర్ ఔట్

image

ఛాంపియన్స్ ట్రోఫీ: ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రోహిత్, గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, అయ్యర్ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, అయ్యర్ 45 పరుగుల వద్ద ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 27 ఓవర్లలో 136/3గా ఉంది. భారత్ విజయానికి మరో 23 ఓవర్లలో 129 పరుగులు కావాలి. కోహ్లీ (51*), అక్షర్ పటేల్ (2*) క్రీజులో ఉన్నారు.

News March 4, 2025

మదనపల్లె: ఉద్యోగం పేరుతో మోసపోయిన అమ్మాయిలు

image

ఉద్యోగం పేరుతో ముగ్గురు అమ్మాయిలు మోసపోయిన ఘటన మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి(M)కి చెందిన ముగ్గురు అమ్మాయిలు డిగ్రీ చదివారు. వారికి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. రూ.18వేలు జీతం అని మాయమాటలు చెప్పారు. ఉద్యోగంలో చేరాలంటే రూ.45వేలు కట్టాలనడంతో నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు. తీరా వారు జాబ్‌లో చేరిన తరువాత మోసపోయామని గ్రహించడంతో పోలీసులను ఆశ్రయించారు.

error: Content is protected !!