News February 23, 2026

భూపాలపల్లి: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

image

భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాలో 12 మండలాలు ఉండగా 8 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసి కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. 34 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉండగా.. ప్రథమ సంవత్సరంలో 1,842, ద్వితీయ సంవత్సరంలో 1,996 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Similar News

News February 25, 2026

తాడిపత్రిలో కారు బీభత్సం.. 2 భాగాలుగా విడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్

image

తాడిపత్రి మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో ట్రాక్టర్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజిన్ భాగాలు రెండుగా విడిపోయాయి. కారుకు సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలు కాగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 25, 2026

24 గంటలూ స్పీడ్ పోస్ట్ బుకింగ్

image

AP: ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 11 నగరాల్లో 24 గంటలూ స్పీడ్ పోస్ట్, పార్సిల్ బుకింగ్ సేవలను అందించనుంది. ఆ జాబితాలో విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, అనంతపురం, రాజమండ్రి, ఒంగోలు, గుంతకల్ ఉన్నాయి. అలాగే మరో 242 పట్టణాల్లో సబ్ పోస్టాఫీస్‌ల పనివేళలను రెండు గంటలు పెంచింది.

News February 25, 2026

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

image

కర్నూలు రూరల్ సర్కిల్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ లైబ్రేరియన్ పేరం భైరవి రోడ్డు దాటుతుండగా డోన్ వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భైరవి, బైక్ రైడర్ ఆవుల అరవింద్ తీవ్రంగా గాయపడ్డారు. GGHలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.