News April 13, 2026

భూపాలపల్లి: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

ఇంటర్ ఫలితాల్లో భూపాలపల్లి జిల్లాలో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 34 కళాశాలల్లోని ఫస్ట్ ఇయర్‌లో 1734 విద్యార్థులకు 1259 మంది, సెకండ్ ఇయర్‌లో 1740 మందికి 1439 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో గతేడాది 56% రాగా ఈ ఏడాది 73.03 % , సెకండ్ ఇయర్‌లో గత ఏడాది 72.07 శాతం, ఈఏడాది 82.34% మంది విద్యార్థులు పాసయ్యారు.

Similar News

News April 13, 2026

అంబేడ్కర్ కోనసీమలో 2400 ఏళ్ల నాటి అద్భుతం.. ఏంటో తెలుసా?

image

అంబేడ్కర్ కోనసీమలో బౌద్ధం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి అదుర్రు గ్రామమే నిదర్శనం. ఇక్కడి మహాస్థూపం సుమారు 2400 సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు శాఖ పరిశోధనలో తేలింది. మౌర్య చక్రవర్తి అశోకుని కుమార్తె సంఘమిత్ర.. శ్రీలంకకు వెళ్లే మార్గంలో ఇక్కడ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఈ స్థూపానికి పునాది వేశారు. సాంచి, సార్నాథ్‌ ​తర్వాత ముఖ్యమైన స్థూపాలలో ఒకటిగా అదుర్రు గుర్తింపు పొందింది.

News April 13, 2026

భద్రాద్రి కలెక్టర్‌తో ఎంపీ రేణుక భేటీ

image

ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భద్రాచలం వచ్చిన ఆమెను కలెక్టర్ అంకిత్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వీరబాబు, కొత్తగూడెం మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కమిషనర్ సుజాత కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి జిల్లా సమస్యలు, సమగ్ర అభివృద్ధి పై చర్చించారు.

News April 13, 2026

పబ్లిక్ గార్డెన్‌లో రేపు అంబేడ్కర్ సినిమా ప్రదర్శన

image

నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో రేపు (మంగళవారం) డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బయోపిక్ ప్రదర్శించనున్నారు. తెలుగు లలితకళా తోరణంలో ఈ ప్రదర్శన ఉంటుంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని సాంస్కతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.