News December 18, 2025
భూపాలపల్లి: ఇలా జరిగిందేమిటి? ఎంత ఖర్చు చేసినా దక్కని విజయం!

జిల్లాలో 3 విడతలుగా 248 పంచాయతీలు, 2,102 వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ముందు నుంచి విజయ అవకాశాలు ఉండటం, ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా ఓటు అభ్యర్థించి ఎంతో కొంత ముట్టజెప్పిన ఓటర్లు మాత్రం భిన్నంగా తీర్పు ఇవ్వడంతో ఆవేదనలో ఉన్నారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టినా విజయం దక్కలేదని ఓటమి చెందిన అభ్యర్థుల ఆవేదన చెందుతున్నారు.
Similar News
News December 19, 2025
125 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

కోల్ ఇండియా లిమిటెడ్(<
News December 19, 2025
నేడు 5వ T20.. కోహ్లీని అభిషేక్ దాటేస్తారా?

IND, SA మధ్య నేడు 5వ T20 జరగనుంది. గిల్‌కు గాయం కావడంతో అభిషేక్‌తో సంజూ ఓపెనర్‌గా వచ్చే ఛాన్సుంది. కాగా ఈ మ్యాచులో అభిషేక్‌ను ఓ రికార్డ్ ఊరిస్తోంది. మరో 47 రన్స్ చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన IND బ్యాటర్‌గా నిలుస్తారు. 2016లో కోహ్లీ 1614 రన్స్ చేయగా, ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసే ఛాన్స్ వచ్చింది. అటు బుమ్రా జట్టులో చేరే అవకాశముంది. అహ్మదాబాద్‌లో 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
News December 19, 2025
ఎన్నికల్లో పోటీ చేశారా? ఇలా చేయకుంటే చర్యలు తప్పవు!

TG: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులంతా 45 రోజుల్లోగా ఖర్చు నివేదికలను ఎంపీడీవోలకు సమర్పించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. సకాలంలో అందజేయకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. బరిలో నిలిచినవారు వివరాలు ఇవ్వకుంటే మూడేళ్ల వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది.


