News December 29, 2025
భూపాలపల్లి: ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో పారదర్శకత!

ఉపాధి హామీ పథకంలో నిధుల మంజూరును మరింత పకడ్బందీగా చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్పులు చేపట్టింది. పాత పద్ధతిని పక్కన పెట్టి, పీఎఫ్ఎంఎస్, ఎస్ఎన్ఏ స్పార్శ్ మాడ్యూల్ ద్వారా నిధులు విడుదల చేయనుంది. దీనివల్ల ట్రెజరీ నుంచి ఆమోదం పొందిన తర్వాతే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బిల్లులు జమ అవుతాయి. జిల్లాలోని 1,05,504 జాబ్ కార్డుదారులకు ఈ కొత్త విధానం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
Similar News
News December 30, 2025
BIG BREAKING: మే నెలలో GHMC ఎన్నికలు?

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు 117 మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే FEBలోనే రంగారెడ్డి 6, మేడ్చల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు ఉంటాయి. FEBలోనే GHMC పాలకవర్గం ముగియనుంది. దీంతో వెంటనే మే నెలలో GHMC ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు కూడా మేలోనే ఎన్నికలుంటాయి.
SHARE IT
News December 30, 2025
BIG BREAKING: మే నెలలో GHMC ఎన్నికలు?

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు 117 మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఫిబ్రవరిలోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఉంటాయి. ఇదే సమయంలో GHMC పాలకవర్గం ముగియనుంది. దీంతో వెంటనే మే నెలలో GHMC ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.
SHARE IT
News December 30, 2025
రామగుండం: 12.30AMలోపు వేడుకలు ముగించుకోవాలి: సీపీ

నూతన సంవత్సర వేడుకలను 12:30AMలోపు ముగించుకోవాలని సీపీ అంబర్ కిషోర్ తెలిపారు. 10PM నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చట్టానికి లోబడి ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


