News March 7, 2026
భూపాలపల్లి: ఎస్ఐల బదిలీలకు రంగం సిద్ధం?

జిల్లా పోలీస్ శాఖలో త్వరలో భారీగా బదిలీలు జరగనున్నాయి. ఎస్పీగా సంకీర్త్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో ఎస్ఐల బదిలీలు జరగలేదు. 13 పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం 26 మంది ఎస్ఐలు విధులు నిర్వహిస్తున్నారు. రెండేళ్లకు పైబడి ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనువైన ప్రాంతాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు పలువురు ఎస్ఐలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Similar News
News April 13, 2026
శ్రీశైలంలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

శ్రీశైలంలో సోమవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన కొందరు భక్తులు మల్లన్న దర్శనార్థమై కారులో శ్రీశైలం వచ్చారు. దేవస్థానం టోల్ గేట్ దాటిన తర్వాత కుక్క అడ్డురావడంతో దానిని తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి గాయాలు కాగా.. ఓ మహిళకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 13, 2026
9 పరుగులకే సగం మంది ఔట్

RRతో మ్యాచులో SRH బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. 3 ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ప్రఫుల్ హింగే 4, సాకిబ్ హుస్సేన్ ఒక వికెట్ తీశారు. వైభవ్, జురెల్, ప్రెటోరియస్ డకౌట్ అయ్యారు. జైస్వాల్ (1), పరాగ్ (4) కూడా ఫెయిల్ అయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 3.3 ఓవర్లలో 11/5గా ఉంది. విజయానికి మరో 206 రన్స్ కావాలి.
News April 13, 2026
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: కలెక్టర్

కొండపాక మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, అందుకు రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించాలని ఆమె ప్రజలకు సూచించారు.


