News January 9, 2026

భూపాలపల్లి ఎస్పీ ఫొటోతో ఫేక్ వాట్సాప్!

image

జిల్లాలో సైబర్ నేరగాళ్లు బరితెగించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతో వాట్సాప్ మేసేజ్‌లు పంపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా జిల్లా ఎస్పీ సంకీర్త్ ఫొటోతో ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి మేసేజ్‌లు పంపిస్తున్నారు. ఫర్నీచర్ తక్కువ ధరకు ఉందని, కొనుగోలు చేసేందుకు తనకు డబ్బులు పంపాలని పలువురికి ఎస్పీ ఫేక్ నంబర్‌తో మేసేజ్‌లు వెళ్లాయి. ఇది పోలీసుల దృష్టికి రాగా వారు అప్రమత్తమయ్యారు.

Similar News

News February 5, 2026

శారీరక అంగీకారం వేధింపులకు లైసెన్స్ కాదు: HC

image

శారీరక సంబంధానికి అంగీకరించినంత మాత్రాన వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసులో నిందితుడి బెయిల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో సంబంధం కొనసాగిందన్న వాదనను తోసిపుచ్చింది. అంగీకారం ఉన్నా లైంగిక దాడులు నేరమేనని తెలిపింది. ఏకాంత వీడియోలు తీసి బలవంతం చేయడం ఏకాభిప్రాయం కిందకు రాదని తేల్చి చెప్పింది.

News February 5, 2026

1981 నుంచి 2011 వరకు భూపాలపల్లి పంచాయతీ!

image

కమలాపూర్ శివారు పల్లెగా ఉన్న BHPL నేడు జిల్లా కేంద్రంగా విరాజిల్లుతోంది. 1981లో కేవలం 500 జనాభా, 300 మంది ఓటర్లతో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడిన ఈ ప్రాంతం, అనతి కాలంలోనే అద్భుత ప్రగతిని సాధించింది. 2011 వరకు సర్పంచ్‌ల పాలనలో ఉన్న BHPL, సింగరేణి గనులు, KTPP వంటి భారీ పరిశ్రమల రాకతో పారిశ్రామికంగా ఎదిగింది. మండల, నియోజకవర్గ కేంద్రంగా రూపాంతరం చెంది, నేడు జిల్లా పరిపాలన కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.

News February 5, 2026

పల్నాడు: ముగ్గురు త్రికోటేశ్వరుల క్షేత్రం.. కోటప్పకొండ!

image

కోటప్పకొండలో వెలసిన త్రికోటేశ్వరస్వామి క్షేత్రం భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఇక్కడి 3 ప్రధాన శిఖరాలు త్రిమూర్తుల స్వరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు. బ్రహ్మ శిఖరంపై త్రికోటేశ్వరస్వామి, రుద్ర శిఖరంపై పాతకోటయ్యస్వామి, విష్ణు శిఖరంపై పాప విమోచన స్వామి కొలువై నిత్యం పూజలు అందుకుంటున్నారు. ప్రధానంగా త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.