News October 3, 2025

‘భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం’

image

భూపాలపల్లి ఏరియాలో 100 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ముందుకెళ్లాలని సింగరేణి ఏరియా మేనేజర్ ఏ.రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కార్యాచరణ ప్రణాళికలపై సమావేశం నిర్వహించారు. సింగరేణి కంపెనీ వ్యాప్తంగా 100 మిలియన్ టన్నులు సాధించే దిశగా ఏరియాలో, సంస్థలో చేపట్టాల్సిన కొత్త ఆవిష్కరణలపై చర్చించారు.

Similar News

News October 4, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 04, శనివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.05 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.02 గంటలకు
✒ ఇష: రాత్రి 7.15 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 4, 2025

భారత్‌లో తాలిబన్ మంత్రి పర్యటనకు లైన్ క్లియర్

image

అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్‌పై ట్రావెల్ బ్యాన్‌ను UNSC తాత్కాలికంగా ఎత్తేసింది. తాలిబన్ నేతలపై బ్యాన్ అమల్లో ఉండగా దౌత్యం, అత్యవసర అంశాల్లో మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన ఈనెల 9-16 మధ్య భారత్‌లో పర్యటించేందుకు లైన్ క్లియరైంది. 2021లో అఫ్గానిస్థాన్‌లో అధికారం చేపట్టిన తర్వాత భారత్‌లో తాలిబన్ నేత పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల దౌత్య సంబంధాలు, ట్రేడ్‌పై చర్చ జరిగే అవకాశముంది.

News October 4, 2025

గోనె సంచులను అందించేందుకు చర్యలు: జేసీ

image

మిల్లర్ల నుండి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జేసి రాహుల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ల మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జేసి అన్నారు.