News January 2, 2026

భూపాలపల్లి: కొత్త సంవత్సరం పూట.. ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు!

image

కొత్త సంవత్సరం పూట ఆ ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు వచ్చారు. ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. BHPL జిల్లా నేరేడుపల్లికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో జిల్లాకేంద్రంలోని 100 పడకల ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరు కవలల(ఆడపిల్లలు)కు జన్మనిచ్చింది. న్యూ ఇయర్ రోజు కవలలు పుట్టడంతో కుటుంబ సభ్యలు సంతోషంలో మునిగిపోయారు.

Similar News

News January 2, 2026

మన మిలిటరీ స్థావరాలపై పాక్ ఫేక్ ప్రచారం!

image

పాక్ మరోసారి తన నక్క బుద్ధి చూపించింది. ప్రో పాకిస్థాన్ SM అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారానికి తెరలేపింది. గతేడాది మే నెలలో యుద్ధం సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌బేస్, బియాస్‌లోని బ్రహ్మోస్ స్థావరంపై దాడి చేసినట్లు ఆయా అకౌంట్లలో పోస్టులు చేశారు. దాడికి ముందు, తర్వాత అంటూ తప్పుడు చిత్రాలను షేర్ చేశారు. కానీ ఆ నిర్మాణాలు ఎప్పటిలానే ఉన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా స్వతంత్ర నిపుణులు తేల్చారు.

News January 2, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 02, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:46 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4:18 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5:54 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7:11 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 2, 2026

చిత్తూరు MPకి 94 శాతం హాజరు

image

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.