News March 31, 2025

భూపాలపల్లి: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం

image

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.

Similar News

News November 8, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదరణ పథకం కింద పేదలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు.

News November 8, 2025

తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

image

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.