News March 31, 2025
భూపాలపల్లి: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
Similar News
News November 14, 2025
ఇందిరా మహిళా శక్తి చీరల లక్ష్యాన్ని చేరాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల: మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి యూనిఫాం చీరల క్లాత్ ఆర్డర్ లక్ష్యాన్ని తప్పక చేరాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కలెక్టరేట్‌లో చేనేత జౌళి శాఖ అధికారులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు, ఆసాములు, యజమానులతో శుక్రవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. చీరల తయారీలో నాణ్యత పాటించాలని సూచించారు.
News November 14, 2025
PG పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ లో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ప్రకటించారు. ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాలుగో సెమిస్టర్ ఫలితాలు ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.
News November 14, 2025
CII: 2 రోజుల్లోనే ₹7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

AP: విశాఖలో నిర్వహిస్తున్న CII సదస్సు మంచి ఫలితాలిస్తోంది. నిన్న, ఇవాళ కలిపి ₹7,14,780 CR పెట్టుబడులపై 75 MOUలు జరిగాయి. వీటి ద్వారా 5,42,361 ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
* తొలి రోజు సదస్సులో మొత్తంగా 40 కంపెనీలతో ₹3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. వీటి ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం.
* నిన్న 35 ఒప్పందాల ద్వారా ₹3,65,304 కోట్ల పెట్టుబడులు. వీటితో 1,26,471 ఉద్యోగాలు.


