News December 7, 2025
భూపాలపల్లి: ఖర్చు లేకుండానే సోషల్ మీడియాలో ప్రచారం

జిల్లాలో 248 పంచాయితీలు, 2,102 వార్డులు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూప్‌లలో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతి గ్రామంలో 5 కంటే ఎక్కువ వాట్సప్ గ్రూపులు ఉన్నాయి. వీటిలో 60 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. నన్ను గెలిపిస్తే గ్రామంలో చేసే అభివృద్ధి, ప్రచారం తీరుపై పోస్టులు పెడుతున్నారు.
Similar News
News April 14, 2026
HYDతో అంబేడ్కర్‌కు విడదీయలేని అనుబంధం

Dr.BR.అంబేడ్కర్‌కి HYDతో విడదీయలేని అనుబంధం ఉంది. 1932లో తొలిసారి నగరానికి రాగా, 1944లో జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో మాట్లాడి దళితులను చైతన్యపరిచారు. 1953లో నిజాం కాలేజీలో ఆయన ప్రసంగం విని ఆకర్షితుడైన నిజాం ఆయనను HYD స్టేట్‌కు చీఫ్ జస్టిస్‌గా నియమించాలనుకున్నారు. సామాజిక సంస్కరణలు, విద్యావ్యాప్తికి ఆయన పలుమార్లు ఇక్కడికి వచ్చారు. ట్యాంక్ బండ్‌పై ఆయన భారీ విగ్రహం నగరానికి ప్రతీకగా నిలిచింది.
News April 14, 2026
ఫ్యాటీ లివర్.. A Big Problem.. లక్షణాలు, నివారణ

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం 130Cr మంది ఈ వ్యాధి(MASLD)తో బాధపడుతుండగా 2050 నాటికి ఈ సంఖ్య 200Crకు చేరొచ్చని ‘ది లాన్సెట్’ అంచనా వేసింది. లిక్కర్ అలవాటు లేకపోయినా కొవ్వు పేరుకుపోవడం, ఒబెసిటీ, టైప్ 2 డయాబెటిస్, బీపీ వల్ల ఇది వస్తుంది. కామెర్లు, అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గుదల దీని లక్షణాలు. డాక్టర్ సూచన మేరకు జీవనశైలి మార్పులు, మందులతో అదుపులో ఉంచుకోవచ్చు.
News April 14, 2026
తిరుపతి గంగమ్మ జాతర తొలి వారం ప్రారంభం

తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మే నెలలో వారం రోజుల పాటు ఘనంగా జరుగనుంది. జాతర ముందు మూడు వారాలు, జాతర తరువాత ఐదు వారాలు మారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలి వారం ప్రారంభం కావడంతో ప్రత్యేక అభిషేకాలు, విశేషాలంకరణలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు.


