News January 19, 2026
భూపాలపల్లి: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: కలెక్టర్

అభివృద్ధిలో గ్రామాలు రోల్ మోడల్‌గా నిలవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం భూపాలపల్లిలో జరిగిన సర్పంచుల శిక్షణలో ఆయన మాట్లాడారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రతి సర్పంచ్ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గాంధీజీ కన్న కలల ప్రకారం గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గుర్తుచేశారు. సర్పంచులు టీమ్ వర్క్‌తో మౌలిక వసతులు కల్పించి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News April 13, 2026
గద్వాల: రేపు వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం: కలెక్టర్

గద్వాల పట్టణం సెకండ్ రైల్వే గేట్ వద్ద వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. అనంతరం ఎంపికైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి వయోవృద్ధులు, దివ్యాంగులు హాజరై జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.
News April 13, 2026
నల్గొండ: రీఛార్జ్‌తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్‌పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.