News November 21, 2025
భూపాలపల్లి: గ్రామాల్లో మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీ

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లోని గ్రామాలకు మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీచేస్తూ కలెక్టర్ నుంచి ప్రకటన వెల్లడించారు. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు స్థానికులై అదే మండలానికి చెందినవారై ఉండాలని, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.
Similar News
News November 21, 2025
తిరుచానూరు పంచమికి పటిష్ట భద్రత

తిరుచానూరులో పంచమి తీర్థం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపధ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పుష్కరిణి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేపట్టారు. రెండువేల మంది సిబ్బందితో బందోబస్తు, లైఫ్ గార్డులు, SDRF, డైవర్స్ నియామకం చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రావడంతో భక్తులు సూచనలు పాటించాలని పోలీసులు కోరారు.
News November 21, 2025
పెద్దపల్లి డీప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్‌గా గర్జనపల్లి బిడ్డ

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన ఐపీఎస్ అధికారి భూక్యా రాంరెడ్డి నాయక్ పెద్దపల్లి డీప్యూటీ కమిషనర్ అఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు. రాంరెడ్డి ప్రస్తుతం సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లో ప్రభుత్వం ఆయనను పెద్దపల్లికి బదిలీ చేసింది. ఈ సందర్భంగా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 21, 2025
మంత్రిగారి మాట కోసం ఎదురు చూపులు..!

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.


