News January 24, 2026
భూపాలపల్లి జిల్లాను రద్దు చేయడం ఎవరి తరం కాదు: ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి జిల్లాను భూకంపం వస్తే తప్ప రద్దు చేయడం ఎవ్వరితరం కాదని అన్నారు. కొందరు సన్నాసులు సీఎం రేవంత్ రెడ్డిపై అబద్దాలను ప్రచారం చేస్తు మున్సిపల్ ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నరని అన్నారు. దమ్ముంటే నిజాయితీగా కొట్లాడాలని సవాల్ విసిరారు.
Similar News
News March 5, 2026
వనపర్తి జిల్లాలో ఘోర ప్రమాదం

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వివరాలు.. ఏదుల నుంచి సంత/కూరగాయల మార్కెట్ ముగించుకొని 12 మందితో వెళ్తున్న ఆటో, రేవల్లి నుంచి వనపర్తికి వెళ్తున్న వరి పొట్టు ట్రాక్టర్ రెండు ఢీన్నాయి. ఈ ఘటనలో ఆటోలోని వెంకటయ్య(50) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను రేవల్లి, కోడేరు, పానగల్ అంబులెన్స్ ద్వారా వనపర్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు. మార్గమధ్యలో సుమిత్ర(42) చనిపోయారు.
News March 5, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

* గద్వాల: క్రీడా పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానం
* పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి: కలెక్టర్
* అలంపూర్: ఏళ్లు గడుస్తున్నా అందని డిగ్రీ విద్య
* రేపు శృంగేరి పీఠాధిపతి రాక
* ఇటిక్యాల: రైలు హాల్టింగ్ కోరుతూ ఎంపీకి వినతి
* ధరూర్: గడువులోగా ఎన్సీడీ స్క్రీనింగ్ పూర్తి చేయాలి
* అయిజ: ఇందిరమ్మ ఇళ్లకు ధరల సెగ
* మల్దకల్: విషాదం.. రైతు బలవన్మరణం
News March 5, 2026
వారంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్?

టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో పెళ్లి పీఠలెక్కనున్నారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయి శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్ ఈ వారంలోనే జరుగుతుందని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. నిశ్చితార్థం తర్వాత వధువు వివరాలు, వివాహ తేదీ, వేదిక వివరాలను ప్రకటిస్తారని టాక్. కాగా విజయ్ దేవరకొండ-రష్మిక FEB 26న పెళ్లాడగా, రేపు(MAR 6) అల్లు శిరీష్-నయనిక వివాహం జరగనుంది.


