News March 11, 2025
భూపాలపల్లి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

భూపాలపల్లి జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.
Similar News
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
GHMC: అసలు మనకెన్ని ఆస్తులున్నాయి..?

GHMCకి అసలు స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆస్తులను సర్వే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేయడానికి కన్సల్టెంట్లను టెండర్లకు ఆహ్వానించారు. నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులు ఉన్నాయని రికార్డుల్లో ఉంది. ఎక్కడెక్కడ, ఏఏ ఆస్తులు ఉన్నాయో త్వరలో సర్వే చేసి మొత్తం ఆస్తి వివరాలు తెలుసుకోనున్నారు.
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్

➦అనకాపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్లే వాహనాలు విశాఖ సిటీలోకి రాకుండా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి.
➦విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➦ విజయనగరం నుంచి విశాఖ రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్, బస్ స్టేషన్, గాజువాక వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా వెళ్లాలి.