News December 11, 2025

భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ షురూ

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మొదలైంది. 4 మండలాల్లోని 82 గ్రామాలు, 712 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

Similar News

News December 12, 2025

ఎన్నికల విధులకు మినహాయింపు లేదు: డీఈవో

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు ఎలాంటి మినహాయింపు లేదని డీఈవో వెంకటేశ్వర్లు శుక్రవారం స్పష్టం చేశారు. ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఉపాధ్యాయుడు ఈ నెల 13న ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయంలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని ఆదేశించారు. కొందరికి మినహాయింపు ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పేర్కొన్నారు.

News December 12, 2025

మరోసారి అన్నా హజారే నిరాహార దీక్ష

image

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్ష చేయనున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఈ దీక్ష చేపట్టనున్నారు. జనవరి 30నుంచి ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. 2022లో దీక్ష చేసినప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదని ఆయన ఆరోపిస్తున్నారు.

News December 12, 2025

పెద్దపల్లి: ఎన్నికల విధుల నిర్లక్ష్యం.. షోకాజ్ నోటీసులు జారీ

image

పెద్దపల్లి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 181 మంది ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, నిర్లక్ష్యంగా పనిచేయడంపై ఈ చర్యలు తీసుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో 53 మంది పోలింగ్ అధికారులు, 128 మంది ఓపీవోలు ఉన్నారు.