News March 5, 2025

భూపాలపల్లి జిల్లాలో మండుతున్న ఎండ!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 36 డిగ్రీలు, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.

Similar News

News January 23, 2026

తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.

News January 23, 2026

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత

image

కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై విధించిన నిషేధాన్ని హైకోర్టు ఎత్తివేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించే షరతులకు లోబడి తిరిగి ప్రారంభించుకోవచ్చని సూచించింది. యాప్ ఆధారిత ద్విచక్ర వాహన రవాణాను నిషేధిస్తూ 2025 జూన్‌లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఓలా, ఉబెర్ తదితర సంస్థలు HCని ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ సమర్థించింది. తాజాగా డివిజన్ బెంచ్ ఆ తీర్పును పక్కన పెట్టింది.

News January 23, 2026

PCOSలో రకాలు తెలుసా?

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే దీంట్లో A, B, C, D అని నాలుగు రకాలుంటాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఏర్పడటం వంటి లక్షణాలుంటాయి.