News August 20, 2025
భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

భూపాలపల్లి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. మహదేవపూర్ 4.2, పలిమెల 4.0, మహాముత్తారం 3.4, కాటారం 2.6, మల్హర్ రావు 18.6, చిట్యాల 7.8, టేకుమట్ల 4.4, మొగుళ్లపల్లి 7.8, రేగొండ 15.6, ఘన్‌పూర్ 6.2, భూపాలపల్లి 12.6 కాగా.. జిల్లా మొత్తం 87.2, యావరేజ్ వర్షపాతం 7.9గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Similar News
News March 5, 2026
భద్రాద్రి: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్‌ను జిల్లా కోర్టు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు జడ్జి వసంత్ పాటిల్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్‌కు సూచించారు.
News March 5, 2026
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.


