News December 17, 2025

భూపాలపల్లి జిల్లాలో 11 గంటలకు 61.64 శాతం పోలింగ్

image

భూపాలపల్లి జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 61.64 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. మండలాల వారీగా మహాముత్తారంలో అత్యధికంగా 70.23%, మహాదేవపూర్‌లో 63.31%, మలహర్‌లో 61.66%, మరియు కాటారంలో 54.60% ఓటింగ్ నమోదైంది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ అంతా ప్రశాంతంగా కొనసాగుతోంది.

Similar News

News December 17, 2025

ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన తాడిపత్రి మండల వాసి

image

తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో నేడు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.

News December 17, 2025

వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

image

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.

News December 17, 2025

దుబ్బా తండా సర్పంచ్‌గా రామ్ నాయక్

image

దేవరుప్పుల మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దుబ్బతండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లకావత్ రామ్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు.