News December 17, 2025

భూపాలపల్లి జిల్లాలో 26.11 శాతం పోలింగ్ నమోదు

image

భూపాలపల్లి జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 26.11 శాతం నమోదైనట్లు డీపీవో శ్రీలత తెలిపారు. కాటారంలో 25.70 శాతం, మహాదేవపూర్-27.23, మహా ముత్తారం – 26.46, మలహర్ – 25.19 శాతం నమోదైనట్టు పేర్కొన్నారు. జిల్లాలో మంది 25,605 హక్కు వినియోగించుకున్నారు. నాలుగు మండలాల్లో 98,052 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Similar News

News December 17, 2025

వికారాబాద్: 11AM.. పోలింగ్ UPDATE

image

వికారాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు జిల్లాలోని 5 మండలాల్లో 57.19 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
1.చౌడాపూర్-52.93%
2.దోమ-63.20%
3.కుల్కచర్ల-60.64%
4.పరిగి-59.66%
5.పూడూర్-49.07%

News December 17, 2025

సేవింగ్స్‌ లేకపోతే ఇదీ పరిస్థితి

image

సేవింగ్స్ విలువను గుర్తు చేసే వాస్తవ కథ ఒకటి SMలో వైరల్‌గా మారింది. 35 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోల్పోయాడు. సదరు కార్పొరేట్ కంపెనీ ఖర్చుల తగ్గింపులో భాగంగా తొలగించేసింది. అయితే అసలు భయం ఏంటంటే అతడి వద్ద ఎటువంటి సేవింగ్స్ లేవు. ఇద్దరు పిల్లల స్కూల్ ఫీజులు, అద్దె, EMIలు భారం అయ్యాయి. ప్రస్తుత రోజుల్లో ఏ కంపెనీలోనూ ఉద్యోగ భద్రత ఉండదని, యువత ఆ భ్రమ నుంచి బయటకు రావాలని అతడు సూచించాడు.

News December 17, 2025

KMR: ప్రశాంతంగా పోలింగ్: 56.71 శాతం నమోదు

image

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలాల వారీగా పరిశీలిస్తే, అత్యధిక పోలింగ్ శాతం పెద్ద కొడప్గల్ (64.40%) డోంగ్లి (63.57%) మండలాల్లో రికార్డయింది. ఇతర మండలాల్లో బాన్సువాడ (57.55%), బిచ్కుంద (61.78%), బీర్కూర్ (51.13%), జుక్కల్ (52.25%), మద్నూర్ (53.37%), నసురుల్లాబాద్ (55.82%) శాతం పోలింగ్ నమోదైంది.