News January 5, 2026
భూపాలపల్లి జిల్లాలో 350 అర్జీలు పెండింగ్: కలెక్టర్

ప్రజావాణి అర్జీలు పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 47 వినతులు స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం శాఖలు వారిగా 350 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిన పరిష్కరించాలన్నారు.
Similar News
News February 4, 2026
క్వారీ లీజ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి: కలెక్టర్

నవ్య రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో మైన్స్, రెవెన్యూ, అటవీ, పర్యావరణ శాఖల సమన్వయం కీలకమని NTR కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో క్వారీ లీజుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అవసరమైన NOCలను త్వరగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని పనులకు అవసరమైన గ్రావెల్ కొరత రాకుండా చూడాలని సూచించారు.
News February 4, 2026
14వ తేదీ నుంచి వేటను నిలిపివేయండి: జేడీ లక్ష్మణరావు

విశాఖలో జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మూలపాలెంలో నిర్వహించిన సదస్సులో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలు పాటించాలని, బోట్లు సంచరించకుండా సహకరించాలని ఆయన కోరారు. తీర ప్రాంతాల పరిశుభ్రతపై కూడా మత్స్యకారులకు అవగాహన కల్పించారు.
News February 4, 2026
సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్

UPSC సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2026 విడుదలైంది. ఈ ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 24వ తేదీ 6PM వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను <


