News April 24, 2025
భూపాలపల్లి జిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఎండ

భూపాలపల్లి జిల్లాలో ఎండలు తీవ్రంగా మారాయి. ఇటీవల వర్షాలు కురిసినప్పటికీ, గురువారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలను దాటింది. ఈ ఊహించని వేడిమి వల్ల మధ్యాహ్నం రోడ్లపై జనసంచారం ఆగిపోయింది. చాలా మంది వడదెబ్బకు గురై, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రజలు ఇంటిలోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అసాధారణ వాతావరణం ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు తెలిపారు.
Similar News
News April 24, 2025
టూరిజం ప్యాకేజీలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో పర్యాటకులకు మధురానుభూతి మిగిల్చేలా రూపొందించిన ప్రత్యేక ప్యాకేజీలపై అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధించి కరపత్రాలను ఆకర్షణీయంగా రూపొందించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో టూరిజం ప్యాకేజీపై పర్యాటక, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
News April 24, 2025
‘హిట్-3’ సినిమా నిడివి ఎంతంటే?

నాని, శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కిన ‘హిట్-3’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం సినిమా నిడివి 2.37:06 గంటలుగా ఉంది. సినిమాలో బూతు పదాల వాడుకను పరిమితం చేసింది. హింస ఎక్కువగా ఉన్న సీన్లలో మార్పులు సూచించింది. ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా A సర్టిఫికెట్ మూవీస్‌కి 18+ వయసున్న అభిమానులనే థియేటర్లకు అనుమతించాలని సెన్సార్ బోర్డు పేర్కొంటుంది.
News April 24, 2025
సునీల్ కుమార్‌పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు

AP: సర్వీసు నిబంధనల ఉల్లంఘన, వివిధ అభియోగాలతో CID మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు చేసింది. ప్రభుత్వానికి తెలియకుండా ఆయన పలుమార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపింది. జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని 2సార్లు UAE, మరోసారి ప్రభుత్వానికి తెలియకుండా స్వీడన్, ఇంకోసారి US వెళ్లారని పేర్కొంది. ప్రతి అభియోగంపై 30రోజుల్లో రాతపూర్వక జవాబివ్వాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది.