News July 28, 2024

భూపాలపల్లి జిల్లాలో 450mm వర్షపాతం

image

భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటల వరకు 450.0 MM వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.. పలు మండలాల వివరాలు చూస్తే
మహదేవపూర్ 35.6, పలిమెల 12.4, మహాముత్తారం 75. 2, కాటారం87.2, మల్హర్ 41.0, చిట్యాల 38.4, టేకుమట్ల 33.6, మొగుళ్లపల్లి 35. 2, రేగొండ:25. 2, ఘనపూర్ 22.4 భూపాలపల్లి 43.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది.

Similar News

News February 12, 2026

ఎనిమిది మంది రైతులకు ఆర్బిట్రేషన్ పూర్తి: కలెక్టర్

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (163జీ) నిర్మాణంలో భూములు కోల్పోయిన సంగెం మండల రైతులతో వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద గురువారం తన చాంబర్‌లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన సమస్యలు, నష్టపరిహారంపై చర్చించి 8 మంది రైతులకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. హైవే నిర్మాణానికి రైతులు సహకరించాలని, నిబంధనల ప్రకారం న్యాయమైన నష్టపరిహారం అందుతుందని పేర్కొన్నారు.

News February 11, 2026

వరంగల్ జిల్లాలో 85.42శాతం పోలింగ్

image

వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వర్ధన్నపేట, నర్సంపేట పట్టణాల్లో ఎన్నికలు జరగగా మొత్తం 85.42శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో 51,494 ఓట్లకు గాను 43,985 మంది ఓటు వేశారు. ఇందులో వర్ధన్నపేటలో 86.23శాతం, నర్సంపేటలో 85.21శాతం పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా జిల్లాలో 84.93శాతం పురుషులు, 85.87శాతం మహిళలు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News February 11, 2026

వరంగల్: ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన ఈ పరీక్షలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. చివరి రోజున జిల్లా వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపక బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.