News February 14, 2025

భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్

image

భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(ఎన్.యూ.జే.ఐ) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి రాజు, గట్టు రవీందర్, అరిగేలా జనార్దన్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు.

Similar News

News February 6, 2026

బాలికల మిస్సింగ్ కేసులు పెరగలేదు: ఢిల్లీ పోలీసులు

image

ఢిల్లీలో బాలికల మిస్సింగ్ కేసులు పెరిగాయన్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. పెయిడ్ ప్రమోషన్లతో కొందరు ఈ అంశానికి హైప్ తీసుకొస్తున్నారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా JAN 1 నుంచి 15 మధ్య 509 మంది బాలికలు, మహిళలు తప్పిపోయినట్లు పోలీసుల డేటా వెల్లడించిందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే 2025తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని, కేసులు పెరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.

News February 6, 2026

పల్నాడు: కొండవీడు ఉత్సవాల షెడ్యూల్ విడుదల!

image

జిల్లాలోని చారిత్రక కొండవీడు కోట ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. 2026 ఫిబ్రవరి 7, 8 తేదీల్లో వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాల షెడ్యూల్‌ను కలెక్టర్ కార్యాలయం విడుదల చేసింది. కలెక్టర్ కృత్తికా శుక్ల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలందరూ ఈ వేడుకలకు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

News February 6, 2026

సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా?

image

AP: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. కాగా ఇప్పటివరకు CM ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు TTD EOగా అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న TTD EO సింఘాల్‌ను బదిలీ చేశారు.