News November 17, 2025

భూపాలపల్లి జిల్లా ప్రజలకు SP ముఖ్య గమనిక

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోకుండా, సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు,వెబ్‌సైట్లు, అలాగే IPO ఆఫర్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే IPO ఆఫర్లను నమ్మొద్దని, ఎవ‌రైనా అడ్వాన్స్ పేమెంట్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలన్నారు.

Similar News

News November 17, 2025

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు

image

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత మంగళవారం తీర్పు చెప్పారు. చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 14 మంది సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

రాత్రిళ్లు, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి: వరంగల్ సీపీ

image

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించేందుకు వీక్షణ సామర్థ్యం తక్కువుగా ఉంటుందన్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోవాలన్నారు.