News March 22, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉ.8గంటల వరకు 33.0మీ.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 7.0, పలిమెల 4.0, ముత్తారం 1.0, కాటారం 4.3, మల్హర్రావు 1.5, చిట్యాల్ 2.5, టేకుమట్ల 3.3, మొగుళ్లపల్లి 2.0, రేగొండ 1.3, కొత్తపల్లిగోరి 1.3, భూపాలపల్లి 1.8మీ.మీటర్ల వర్షం నమోదయింది.

Similar News

News March 22, 2025

వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు

image

కేంద్ర ప్రభుత్వం 2025కు గాను జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించింది. ప్రఖ్యాత హిందీ రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘నౌకర్ కీ కమీజ్’ నవలను ఇందుకు ఎంపిక చేసింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆయన 50 ఏళ్లుగా సాహిత్య సేవ చేస్తున్నారు.

News March 22, 2025

కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 22, 2025

కాగజ్‌నగర్: 3 ఇళ్లల్లో చోరీ.. నిందితుడు అరెస్ట్

image

3 ఇళ్లలో చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో  కొద్ది రోజుల క్రితం 3 ఇళ్లలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ప్రదీప్ అనే నిందితుడుని పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 86.6 గ్రా. బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.

error: Content is protected !!