News April 9, 2025

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 13.4 మి.మీ వర్షం

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 8 గంటల వరకు 13.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మండలాల వారిగా మహదేవ్‌పూర్ 4.2, పలిమెల 0, ముత్తారం 4.2, కాటారం 2.6, మల్హర్ రావు 0, చిట్యాల 0, టేకుమట్ల 0, మొగుళ్లపల్లి 0, రేగొండ 0, ఘన్‌పూర్ 1.2, కొత్తపల్లి గోరి 0, భూపాలపల్లి  1.2 మి.మీ వర్షం నమోదైంది. 

Similar News

News April 18, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* TG: జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ కీలక ఒప్పందం!
* కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోంది: భట్టి
* ప్రజలే ప్రభుత్వాన్ని కూలగొడతారు: KTR
* AP: డీఎస్సీకి వయోపరిమితి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
* పాస్టర్ల గౌరవ వేతనానికి రూ.30 కోట్ల నిధుల విడుదల
* హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: బొత్స
* IPL: SRHపై ముంబై విజయం

News April 18, 2025

‘గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలి’

image

అనంతపురం కలెక్టరేట్‌లో రెవెన్యూ భవనంలో గురువారం సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల తెగల వారి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

News April 18, 2025

సూపర్‌హిట్ మూవీ సీక్వెల్‌లో తమన్నాకు ఛాన్స్!

image

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘నో ఎంట్రీ‌’ సీక్వెల్‌లో హీరోయిన్ తమన్నా భాటియా ఛాన్స్ కొట్టేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ హీరోలు అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా 2005లో రిలీజైన ‘నో ఎంట్రీ’లో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు నటించారు.

error: Content is protected !!