News January 1, 2026

భూపాలపల్లి: డిసెంబర్ నెల బొగ్గు ఉత్పత్తిపై జీఎం వివరణ

image

భూపాలపల్లి సింగరేణి జీఎం కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై డిసెంబర్ నెల వివరాలను ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి వివరించారు.
ఉత్పత్తి ఉత్పాదకత వివరాలు:
బొగ్గు ఉత్పత్తి లక్ష్యం: 4.51 లక్షల టన్నులు
సాధించిన ఉత్పత్తి: 2.95 లక్షల టన్నులు,
సాధించిన ఉత్పత్తి శాతం: 65%
రోజు వారిగా: 9517టన్నుల బొగ్గు రవాణా,
మొత్తం బొగ్గు రవాణా లక్ష్యం: 4.51లక్షల టన్నుల కు 64% రవాణా జరిగింది.

Similar News

News February 3, 2026

గద్వాల జిల్లాలో 285 క్యాన్సర్ కేసులు నమోదు

image

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్ దాస్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 285 క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 131 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. డే కేర్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News February 3, 2026

ప.గో: తల.. మొండెం వేరు వేరుగా

image

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులో నమ్మి రాంబాబు(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రాంబాబు మృతదేహం మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహం పక్కనే చీర వేలాడుతుండగా.. మొండెం నుంచి తల వేరుపడి ఉంది. సుమారు ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.

News February 3, 2026

క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం

image

ఒకే ఆటగాడు రెండు దేశాల తరఫున క్రికెట్ ఆడిన ఘటనలు గతంలో చూశాం. కానీ రెండు దేశాల తరఫున వేర్వేరు క్రీడల్లో వరల్డ్ కప్‌లో పాల్గొన్న అరుదైన ఘట్టం తొలిసారి చోటుచేసుకోనుంది. 2006లో సౌతాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్ ఆడిన వేన్ మ్యాడ్‌సన్ 20 ఏళ్ల తర్వాత ఇటలీ T20 WC కెప్టెన్‌గా బరిలో దిగనున్నారు. ఈయన గతంలో PSL, BPL, హండ్రెడ్ లీగ్‌లలోనూ పాల్గొన్నారు. ఇటలీ తరఫున 2023లో అరంగేట్రం చేశారు.