News September 20, 2025
భూపాలపల్లి: తేనెటీగల పెంపక రైతులకు సబ్సిడీ

తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు ఉద్యానవన శాఖ సబ్సిడీ ద్వారా ప్రోత్సహిస్తోందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకం కింద తేనెటీగల పెంపకం చేపట్టే వారికి 40% నుంచి 60% వరకు సబ్సిడీ అందుతుందని పేర్కొన్నారు. ఈ పథకంలో చేరడానికి ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాల కోసం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదించాలని కోరారు.
Similar News
News September 20, 2025
కడప: 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం 18 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ SP శ్రీనివాస్ వివరాల మేరకు.. కడప(D) ప్రొద్దుటూరు-జమ్మలమడుగు దారిలో వాహనాల తనిఖీ చేపట్టగా పెద్దశెట్టిపల్లి వద్ద కార్లు వేగంగా వస్తూ కనిపించాయి. పోలీసులను చూసి వారు పారిపోయే ప్రయత్నం చేయగా సిబ్బంది చుట్టుముట్టి నిందితులు, 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
News September 20, 2025
ఒట్టిగెడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

వీరఘట్టంలోని వట్టిగెడ్డలో గుర్తుతెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. బ్రిడ్జికి సమీపంలో ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జి.కళాధర్ తమ సిబ్బందితో వచ్చి వట్టిగెడ్డలో మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. ఎవరైనా చంపేసి పడేశారా, లేక ప్రమాదవశాత్తు గెడ్డలో పడి చనిపోయాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News September 20, 2025
ఒంగోలు రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత

ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద శనివారం ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. హౌరా నుంచి బెంగళూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో అబ్దుల్ హుదూద్ వద్ద 1.5 కిలోల గంజాయిని గుర్తించారు. మరో 38 చిన్న గంజా ప్యాకెట్లు దొరికాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని GRP పోలీసులకు అప్పగించారు.