News January 12, 2026
భూపాలపల్లి: ‘ధాన్యం ట్యాబ్ ఎంట్రీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు’

జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో పౌర సరఫరాలు, సహకార శాఖ, డీఆర్‌డీఏ అధికారులు, కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఎంట్రీల ఆలస్యం వల్ల రైతులకు చెల్లింపులు ఆలస్యమవుతాయని, రోజువారీగా డేటా నమోదు చేయాలన్నారు.
Similar News
News March 6, 2026
ప్రజావాణి దరఖాస్తులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలి: మంత్రి సురేఖ

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారస్థితి దరఖాస్తుదారులు తెలుసుకునేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి సమాచారం వారి సెల్ ఫోన్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. MHBDలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలికల వసతి గృహాలలో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో ఆరోగ్య సదస్సులు నిర్వహించి, వైద్య పరీక్షలు చేపట్టాలన్నారు.
News March 6, 2026
లబ్ధిదారులకు పథకాలు చేరేలా కృషి చేయాలి: మంత్రి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్ ఐడీఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
News March 6, 2026
ఓపెన్ హౌస్‌లో పోలీసు ఆయుధాల ప్రదర్శన

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి వినియోగం గురించి వివరించారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న శక్తి యాప్, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ విజయలక్ష్మి, ఆర్‌ఐ జావేద్, ఎస్సైలు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.


