News November 4, 2025
భూపాలపల్లి: నర్సింగ్ ఆఫీసర్ అనుమానాస్పద మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్‌లో నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య చేసుకుంది. మంజుర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆమె అనుమానాస్పద రీతిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 5, 2025
అధికారులతో నిర్మల్ కలెక్టర్ సమీక్ష

వర్షాకాలంలో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని, పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో చేపట్టిన పనులపై ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News November 5, 2025
ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <
News November 5, 2025
గూడెం: ఆలయంలో కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు పూర్తి

దండేపల్లి మండలంలోని పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రేపు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.


