News March 16, 2025

భూపాలపల్లి: నెల గడుస్తున్నా దొరకని పెద్దపులి ఆచూకీ!

image

భూపాలపల్లి జిల్లాలో గత నెల రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. జిల్లాలోని అటవి గ్రామాలైన కమలాపూర్, రాంపూర్ గ్రామ పరిధిలోని అడవుల్లో పులి తిరుగుతున్నట్లు అటవిశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ.. పులి ఆచూకీ మాత్రం లభించట్లేదు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతూ వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.

Similar News

News January 3, 2026

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే..

image

పంటల్లో చెదపురుగుల ఉద్ధృతి తగ్గాలంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. గట్లపై కలుపు లేకుండా చూడాలి. బాగి చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పంట మార్పిడి విధానం అనుసరించాలి. పసుపును అంతర పంటగా వేసుకోవాలి. పంట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, తల్లి చెదపురుగును గుర్తించి నాశనం చేయాలి. చెద ఆశించిన మొక్కల మొదళ్లలో లీటర్ నీటికి క్లోరిపైరిఫాస్ 50% EC 2ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.

News January 3, 2026

తిరుపతిలో రేపు చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్

image

హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరికిపాటి, సుస్మిత కొణిదెల, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొననున్నారు.

News January 3, 2026

తిరుమల: సాఫీగా దర్శనం.. భక్తుల హర్షం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి సాధారణ భక్తులకు టోకెన్లు లేకుండానే సర్వదర్శనం క్యూలైన్ నుంచి వైకుంఠ ద్వారం గుండా దర్శనానికి TTD అనుమతిస్తోంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఏర్పాట్లు బాగున్నాయని, సాఫీగా దర్శనం చేసుకున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా SSD టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 20 గంటలు పడుతోంది.