News September 8, 2025

భూపాలపల్లి: న్యాయం చేయాలని మాలమహానాడు డిమాండ్

image

జీవో నంబర్ 99ను రద్దు చేయాలని, 26 ఉపకులాలు ఉన్న మాల కులానికి అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు MLA క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జెల్లా ప్రభాకర్, కె.రాజన్న, జంజర్ల సురేశ్, దండే రణపతి, కేశవులు పాల్గొన్నారు.

Similar News

News September 8, 2025

పత్తి కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీతో సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. పత్తి మార్కెటింగ్ సీజన్ 2025-26 కోసం జిల్లా సగటు దిగుబడిని ఖచ్చితంగా అంచనా వేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

News September 8, 2025

GWL: గ్రీవెన్స్ డే కు 14 ఫిర్యాదులు: ఎస్పీ

image

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 14 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అట్టి ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత ఎస్ఐ లకు సూచించారు. భూ వివాదాలకు సంబంధించి 5, గొడవలకు సంబంధించి 2, ప్లాట్లకు సంబంధించి 3, పొలం బాటకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 3, మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయన్నారు. డీఎస్పీ, సిఐలు పాల్గొన్నారు.

News September 8, 2025

సిద్దిపేట: గురుకులంలో అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

image

వర్షాల సీజన్‌ కావడంతో విద్యార్థులకు అంటూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్ సూచించారు. హబ్సిపూర్ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులు చదువుకునే తరగతి, నిద్రించే గదులు, మరుగుదొడ్లు, వంటశాల, తాగునీటి ప్లాంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.