News August 18, 2025

భూపాలపల్లి: పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం: కలెక్టర్

image

సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం పాపన్న 375వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. దోపిడీ, భూస్వాముల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప బహుజన విప్లవకారుడు పాపన్న అని కొనియాడారు. 12 మందితో సైన్యం స్థాపించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన గొప్ప వీరుడని అన్నారు.

Similar News

News August 18, 2025

ADB: పోలీస్ గ్రీవెన్స్‌కు 20 ఫిర్యాదులు

image

ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతకు 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యను తెలుసుకున్నారు. మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

News August 18, 2025

KMM: రోడ్డు ప్రమాదాలు అరికట్టే దిశగా పోలీస్ చర్యలు

image

ఇటీవల రాత్రివేళలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా ఖమ్మం పోలీస్ శాఖ మరింత పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో సోమవారం పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి డ్రంకన్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్ మొబైల్ చెక్ ద్వారా వేలిముద్రలు సేకరించారు.

News August 18, 2025

HYD: మీ పేరుపై ఎన్ని సిమ్ములు ఉన్నాయో.? ఇలా తెలుసుకోండి.!

image

మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి.? ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నారేమో.? అని ఆందోళన చెందుతున్నారా..? దయచేసి సంచార్ సాథీ పోర్టల్ www.sancharsaathi.gov.inలో మీ పేరు మీద జారీ చేయబడిన SIMS తనిఖీ చేసుకోవాలని సమాచార కేంద్ర శాఖ ప్రజలందరికీ పంపుతున్నట్లు HYD పోలీసు అధికారులు తెలిపారు. మీ సిమ్ వేరే వ్యక్తులు ఉపయోగిస్తే, అది మీపైకి వచ్చే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.